Tuesday, 23 January 2024

హనుమాన్..రివ్యూ

#Hanuman.. #హనుమాన్..my view..

First scene తోనే #ప్రశాంత్ వర్మ మార్కులు కొట్టేశాడు.. ఒక చిన్న కుర్రాడు TV లో super heroes సినిమాలు చూసి తను కూడా అవ్వాలనీ, తనక్కూడా పవర్స్ రావాలని పిచ్చి పిచ్చి పనులు చేయడం(శక్తిమాన్ చూసి చాలా‌ మంది పిల్లలు అలా చేసే వారని విన్నాము)తో సినిమాని interest గా మొదలెడుతాడు.. అసలు టైటిల్స్ పడేప్పుడే ఒక interest క్రియేట్ చేశాడు డైరెక్టర్..ఇక మొదట్లో చెప్పిన కుర్రాడి సీన్ చూసి..అతనే మెయిన్ లీడ్ అనుకుంటాము..అక్కడే వుంది‌ అసలైన ట్విస్ట్.. అది చెప్పను..చూసి తెలుసుకోవాల్సిందే..
ఇక కథ విషయానికొస్తే.. అంజనాద్రి అనే గ్రామంలో అమాయకపు హీరో, ఎన్నో తెలివితేటలున్నా, ఎవ్వరినీ ఎదిరించలేడు..అలాంటోడికి హనుమంతుడి పవర్స్ వస్తే(ఇక్కడ హనుమంతుడేమీ అతనికి పవర్స్ డైరెక్టుగా ఇవ్వడు..but ఎలా వచ్చాయనేది..interesting)..అతను ఏం చేశాడు..తన ఊరిని, తన వాళ్లని, ఊరికి వచ్చిన ఉపద్రవాన్ని..ఎలా ఎదుర్కొని, కాపాడుకున్నాడనేది లైన్..
కథ పరంగా, కథనం పరంగా, VFX పరంగా డైరెక్టర్ కి హ్యట్సాఫ్ చెప్పాల్సిందే..
కెమెరా,VFX,మ్యూజిక్, ఫైట్స్..ఇంకా అన్నీ విభాగాలు చాలా బాగా పనిచేశారు..
నటన పరంగా తేజ సజ్జ, అమృత అయ్యర్, వినయ్ రాయ్(విలన్), సముద్రఖని(ఈ పాత్ర గురించి ఒక రివ్యూ రాయొచ్చు), వెన్నెల‌ కిషోర్, సత్య, గెటప్ శ్రీను, విలేజ్ విలన్, విలేజ్ చేసిన చిన్న చిన్న పాత్రధారులు కూడా చాలా బాగా చేశారు...and ఒక్కరి గురించి చెప్పాలి..#VaralaksmiSharathkumar.. ఏం మాస్ అప్పీలు మావా..? అన్నట్లు చించి పారేసింది..సిస్టర్ సెంటిమెంట్ బాగా వర్కవుటయ్యింది..
టెక్నికల్ గా బాగా చెప్పుకోవాల్సింది.. గ్రాఫిక్స్(VFX)..అస్సలు మామూలుగా లేవు..అంత తక్కువ బడ్జెట్ లో అంత క్వాలిటీగా ఎలా ఇచ్చారో..గ్రేట్.. చివర 20ని.లైతే goosebumps…ఆఖర్లో ఆంజనేయ స్వామీ రావడం ఏదైతే వుందో..పూనకాలే..
సంక్రాంతి విన్నర్.. హనుమాన్.. #Hanuman is a must watch movie..family can enjoy.. Mainly children.. సో మను ఒక సూపర్ హీరో వచ్చాడు(already వున్నాడు..మనమే‌ బయటికి తేలేదు) అని గర్వంగా చెప్పుకోవచ్చు..చివర్లో part-2(Jai Hanuman) కూడా interesting ending.. Kudos to you #PrashanthVarma and team.. Go and watch in theatres only..
కొసమెరుపేంటే..రాకేష్ మాస్టర్ కూడా వున్నాడు..చాలా బాగా యాక్ట్ చేశాడు..ఇంకొందరు యూట్యూబ్ స్టార్స్  కూడా వున్నారు..నవ్వించారు..

No comments:

Post a Comment