Tuesday, 23 January 2024

గుంటూరు కారం..రివ్యూ

 #Gunturukaaram.. #గుంటూరుకారం.. My View.. Already flop టాక్ వచ్చింది..అయినా చూశాను..ఎందుకంటే సినిమా లవర్ని కదా..హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా చూస్తాము..కానీ అంత తీసిపారేసే సినిమాలా అనిపించలేదు..పర్లేదు..ఒకసారి చూడొచ్చు..#SSMB కోసం..మరోసారి చూడొచ్చు.. థియేటర్ లో కాకపోయినా..OTT, TVల్లో ఖచ్చితంగా అందరూ చూస్తారు.. త్రివిక్రం సినిమాలే అంత..థియేటర్లలో తక్కువ చూస్తారు..TVలో అయితే మళ్లీ, మళ్లీ చూస్తారు..ఇక కథ విషయానికొస్తే.. పదేళ్ల వయసులో వున్న కొడుకుని తన తల్లి వదిలేసి పుట్టింటికి వెళ్లిపోతే..పాతికేళ్లయ్యాక కొడుకు తన తల్లిని తిరిగి ఎలా వెనక్కి తెచ్చుకున్నాడు..?  చూస్తుంటే..ఈ కథని ఎక్కడో,రివర్స్ లో చూసినట్లు అనిపిస్తోంది కదా..? కరెక్ట్.. అత్తారింటికి దారేది..కథని కాస్త అటు-ఇటు మార్చి తీశాడు త్రివిక్రం గారు.. అత్తారింటికి దారేదిలో..అత్త పాత్ర..లవ్ మ్యారేజ్ చేసుకొని,వేలకోట్ల ఆస్తి కాదని వెళ్లిపోతుంది..ఇక్కడ అమ్మ పాత్ర వేరే కులం వాడిని పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది.. అక్కడ తండ్రి పాత్ర పాజిటివ్..ఇక్కడ తండ్రి పాత్ర నెగెటివ్.. అక్కడ అత్త పాత్రకు కొడుకుంటే..అదే గుంటూరు కారం.. ఇంకా అల వైకుంఠపురంలో ఛాయలు కూడా చాలా కనిపిస్తాయి.. ఏతావాతా..ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే "కొడుకు దిద్దిన కాపురం", "తల్లీ-కొడుకుల లవ్ స్టోరీ", "అమ్మగారింటికి దారేది"..

And finally..మహేష్ గారి కోసం సినిమా చూడొచ్చు..not bad..వెన్నెల‌కిషోర్ కామెడి బాగుంది.. శ్రీలీల పాత్ర&dance బాగుంది.. థమన్ మ్యూజిక్ కూడా అక్కడక్కడ పేలింది.. పాపం టైం లేదేమో.. త్రివిక్రం గారి డైలాగ్స్ కూడా ఓకే..
నాకు అర్థం కానీ విషయం ఏంటంటే..ఒక కొడుకుగానీ, కూతురుగానీ తన తండ్రి అంటే భయం పోవడానికి యాభయ్యేళ్లు పడుతుందా?? ఫాదర్ బ్యాడ్ అని తెలిశాక కొడుకు దగ్గరికి పోకుండా..తండ్రి మాటకు భయపడి,ఇంకో పాతికేళ్లు తండ్రి చెప్పినట్లు ఏ అమ్మాయైనా మరబొమ్మలా వింటూ..లైఫ్ ని కొన..సా..గి..స్తుందా..నాకైతే అర్థం కాలేదు #Trivikram గారు..సినిమాలో అదే హైలైట్ ట్విస్టు..last లో focus shift shots మాత్రం కరెక్ట్ గా లేవు..రమ్యకృష్ణ గారు చెప్పేప్పుడు..ఖచ్చితంగా కెమెరా ఆమె మీదకు focus shift అవ్వాలి..అప్పుడే ఆమె ఫీలింగ్ జనాలకు అర్తం అవుద్ది కదా..those were very bad shots..and
Finally #Gunturukaaram one time watch movie..

No comments:

Post a Comment